వాణిజ్య ప్రకటనలతో మహేష్ బాబు బిజీ.. బిజీ!

సూపర్‌స్టార్‌ మహేష్‌ సినిమాలు చేస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాలతోనూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్‌లో ఏషియన్‌ సంస్థతో కలిసి ఏఎంబి సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ని నిర్వహిస్తున్నారు. ఏషియన్‌ మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ అనగానే ఒక ల్యాండ్‌ మార్క్‌ అయిపోయింది.

ఇప్పుడు మహేష్‌ బాబు తన బిజినెస్‌ని మరింత పెంచుతున్నారు. మరోసారి ఏషియన్‌ సంస్థతో కలిసి ఇదే ఏఎంబి పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్‌ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఏషియన్‌ సంస్థ ఒక అధికారిక ప్రకటన రిలీజ్‌ చేసింది.

ఈ పూజా కార్యక్రమాలలో ఏషియన్‌ సంస్థ చీఫ్‌ సునీల్‌ నారంగ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కన్నడ నిర్మాత రాక్‌లైన వెంకటేష్‌ ఉన్నాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే మహేష్‌బాబు కుటుంబ సభ్యులు ఎవరూ ఈ వేడుకలో పాల్గొనలేదు. ‘నమ్మ బెంగళూరు ఆట చూస్తావా? విూ అభిమాన ఎఎంబీ సినిమాస్‌ ఇప్పుడు బెంగళూరులో అడుగుపెట్టబోతోంది. పూజా కార్యక్రమాలు జరిగాయి‘ అని ఎఎంబీ సినిమాలో అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన పోస్ట్‌కు మహేష్‌ రీపోస్ట్‌ చేశారు.