‘గోట్‌’ సినిమా కోసం శ్రీలీలకు ఆఫర్‌!?

దర్శకుడు వెంకట్‌ ప్రభు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. టెక్నికల్‌గా హైలో ఉంటుంది. స్క్రీన్‌ మొత్తం నటీనటులు కనిపిస్తారు. విజయ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న ‘గోట్‌’ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని టీమ్‌ చెబుతోంది. ఈ చిత్రం తర్వాత తన 69వ చిత్రం చేసి విజయ్‌ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్‌ కొంతకాలంగా వినిపిస్తోంది.

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ భారీ బ్జడెట్‌తో నిర్మిస్తోంది. నటి విూనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, ప్రేమ్‌జీ, మైక్‌ మోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాల నుంచి సమాచారం. అయితే ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఓ పత్యేక పాత్రలో త్రిష తళుక్కుమన బోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడా స్పెషల్‌ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్‌ క్రేజీ నటి శ్రీలీలతోచర్చలు జరుగుతున్నట్లు మరో వార్త సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అంతే కాదు. ఇందులో శ్రీ లీలకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇదే నిజం అయితే శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం ‘గోట్‌’ అవుతుంది. అలాగే తమిళ స్టార్‌ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.