Vivo V30e: భారత మార్కెట్లోకి వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్?

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. వివోవీ 30 ఈ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇందులో క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించారు. వివోవీ29ఈకి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఇకపోతే ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఫోన్‌ను రెడ్, సిల్క్ బ్లూ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.
కాగా కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఆరా ఎల్ఈడీ ఫ్లాష్ ఇందులో ప్రత్యేకంగా అందించారు. దాదాపు నాలుగేళ్ల పాటు బ్యాటరీ మంచి లైఫ్‌ ఇస్తుందని కంపనీ చెబుతోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేసింది.

మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో కర్వడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌గా దీనిని చెబుతున్నారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్ ధర రూ. 25,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌ టాప్‌ ఎండ్ మోడల్‌ ధర రూ. 30వేలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.