స్టీల్ పాత్రల్లో వంట చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని సమస్యలు వస్తాయా?

మీరు స్టీల్ పాత్రలో వంట చేస్తున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి. మామూలుగా అందరి ఇళ్లల్లో ఎక్కువగా స్టీల్, అల్యూమినియం, నాన్ స్టిక్ వంటి పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇందులోనే బాగా వంటలు చేస్తూ ఉంటారు. అయితే అల్యూమినియం పాత్రలో వంటలు చేస్తే ఆరోగ్య సమస్యలు రావడం ఖాయమని తెలియడంతో ఈ మధ్య చాలామంది అల్యూమినియం పాతలను పక్కకు పెట్టేసి స్టైన్లెస్ స్టీల్ పాత్రలను వాడుతున్నారు.

 

అయితే స్టీల్ పాత్రలలో వండేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి మరింత ముప్పు అని తెలుస్తుంది. మామూలుగా కొత్త స్టీల్ పాత్రలో ఆహారం వండేటప్పుడు అది ఎక్కువగా అడుగంటుతూ ఉంటుంది. అంతేకాకుండా పాత్ర అడుగున కూడా బాగా మాడిపోతూ ఉంటుంది. కాబట్టి కొత్త స్టిల్ పాత్రలో పెద్దమంట మీద ఎప్పుడు ఆహారాన్ని వండకూడదు.

 

నిజానికి స్టీల్ పాత్రలలో టెఫ్లాన్ పూత అనేది అసలు ఉండదు. కాబట్టి స్టీల్ పాత్రలలో ఆహారం వండేటప్పుడు తక్కువ లేదా మధ్యస్థమంటపై ఆహారాన్ని ఉడికించాలి. ఇక సన్నని స్టీల్ పాత్ర పై గ్రిల్ వంటివి చేయకూడదు. మామూలుగా గ్రిల్లింగ్ కోసం పాత్ర ఎక్కువసేపు మంటలో ఉంచవలసి ఉంటుంది. అలా స్టీల్ పాత్రను ఎక్కువసేపు మంటపై ఉంచితే మెటల్ని దెబ్బతీస్తుంది.

 

ఇక డీప్ ఫ్రై లు కూడా చేయకూడదు. కారణం డీప్ ఫ్రై చేయడం వల్ల స్మోక్ పాయింట్ కు మించి చేరుతుంది. దీంతో స్టీల్ పాత్ర పసుపు లేదా జిగటగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి స్టీల్ పాత్రలలో ఆహారం తయారు చేసేవారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయమని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడం సరైన మార్గమని చెప్పాలి.