పాము కాటు వేస్తే, ముందుగా కాటు వేసిన వ్యక్తిని పాము నుండి దూరంగా తీసుకెళ్లాలి. ఆ తర్వాత ఆ వ్యక్తికి వైద్య అవసరాలు అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాటు వేసిన వ్యక్తిని కదలించకుండా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అవయవం కదలకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉంగరాలు, గడియారాలు లేదా బిగుతుగా ఉన్న దుస్తులను తొలగించాలి.
పాము కాటు వేసిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించవద్దు, అది మరింత ప్రమాదకరం కావచ్చు. పాము విషం పీల్చడం మంచిది కాదు, ఎందుకంటే అది విషం మీ నోటిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. పాము కాటు వేసిన ప్రదేశం చుట్టూ టోర్నీకీట్ ఉపయోగించవద్దు, ఎందుకంటే అది అవయవానికి రక్తప్రసరణను తగ్గిస్తుంది. పాము కాటు వేసిన ప్రదేశం చుట్టూ కోత వేయడం మంచిది కాదు.
కాటు వేసిన ప్రదేశానికి మంచుతో చల్లని ప్యాక్ వేయడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. పాము కాటు వేసినప్పుడు మద్యం లేదా ఇతర మందులు వాడటం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం బోడ కాకరకాయ పాము విషాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనిని ఆకాకరకాయ అని కూడా పిలుస్తారు. ఆకాకరకాయను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని యాంటీలిపిడ్ పెరోక్సిడేటివ్ సమ్మేళనాలు ధమనుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఈ కాయల్లోని యాంటీ అలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వైరల్ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాములు ఎక్కువగా సంకహ్రించే ప్రదేశాల్లో నివశించే వాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పాము కాటు వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి.