Kodali Nani: వైయస్సార్సీపీ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఆరోగ్యం గురించి గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతున్నాయి. ఈయన ఉన్నఫలంగా గుండె నొప్పి సమస్యతో బాధపడటంతో హైదరాబాద్లోనే ఏఐజి ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని కేవలం గ్యాస్టిక్ సమస్య కారణంగా ఇబ్బందులకు గురి అయ్యారు అంటూ వైద్యులు తెలియజేశారు.
ఇక గుండెకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించగా చిన్న సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే కొడాలి నానికి మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం కుటుంబ సభ్యులు తనని ముంబైకి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే కొడాలి నాని ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలోనూ అలాగే టిడిపి సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై మరో మాజీ మంత్రి అంబంటి రాంబాబు స్పందించారు.
కొడాలి నాని గుండె నొప్పితో బాధపడుతున్నారని, వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు.. హైదరాబాదులో ఆపరేషన్ చేస్తే ఆయనని చూడటం కోసం పెద్ద ఎత్తున పార్టీ నేతలు తరలివస్తారు తద్వారా కాస్త ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందని అందుకే తనని ముంబై తీసుకు వెళ్లినట్టు తెలిపారు.
కొడాలి నానికి ఆపరేషన్ చేయనున్న డాక్టర్ రమాకాంత్ పాండేకి సర్జరీలు చేయడంలో విశేష అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో నాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వైద్యులు ఆపరేషన్ తేదీని నిర్ణయిస్తారని, ఆపరేషన్ అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. టిడిపి సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను ఎవరు నమ్మద్దు అంటూ ఈ సందర్భంగా అంబటి నాని ఆరోగ్యం పై స్పందించారు.