Devara: దేవర గురించి మాత్రమే మీకు తెలుసు… వర ఎలాంటోడు తెలీదు… పార్ట్ 2 పై అంచనాలు పెంచిన తారక్!

Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన చివరి చిత్రం దేవర ఈ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్ అందుకుంది . ప్రస్తుతం ఈ సినిమా జపాన్ లో కూడా విడుదల అయ్యి మంచి ఆదరణ పొందుతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే ఇక ఎన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయంలో నటించారు. ఇలా ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.. ఇక మొదటి భాగం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోగా రెండో భాగంపై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.. తాజాగా జపాన్లో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ దేవర 2 గురించి మాట్లాడుతూ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.

పార్ట్ 1 చివర్లో దేవరని అతడి కొడుకు వర చంపినట్లుగా చూపించారు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యేది రెండవ భాగంలోనే. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరూ జపాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవర పార్ట్ 1 లో మీరు చూసిన కథ కొంత మాత్రమే. అసలైన కథ దేవర 2లో ఉంటుంది. అది ఇంకా భారీగా అద్భుతం ఉంటుంది.

దేవర 1లో మీరు దేవర గురించి తెలుసుకున్నారు. కానీ వర గురించి మీకు తెలియదు.. అతడు ఎలాంటోడో పార్ట్ 2లో తెలుస్తుంది. దేవరకి, వరకి మధ్య ఏం జరిగిందనేది పార్ట్ 2 లోచూస్తారు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.