Renu desai: నేను చనిపోతాను… నా బిడ్డలను మీరే కాపాడాలి… పవన్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్!

Renu Desai: ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్సిటీలో సుమారు 400 ఎకరాల భూమిని చదును చేయడంతో ఎంతో మంది విద్యార్థులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు.. ఇలా యూనివర్సిటీలో 400 ఎకరాలలో పూర్తిగా అటవీ ప్రాంతంలో మారిపోయింది. ఉన్నఫలంగా బుల్డోజర్ల సహాయంతో ఈ ప్రాంతాన్ని చదును చేయడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు నివసిస్తున్నాయి అలాగే ఎన్నో అరుదైన మొక్కలు కూడా అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని చదును చేయటం వల్ల ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా స్పందించారు తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం ఈ ఘటన పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..నమస్కారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారూ ఒక పబ్లిక్గా హృదయపూర్వక విజ్ఞప్తి. నాకు రెండు రోజుల క్రితం HCU అంశం గురించి తెలిసింది.

కొన్ని విషయాల గురించి కూడా కనుక్కున్నాను. అందువల్లనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక తల్లిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వయస్సు 44 ఏళ్లు. నేను రేపో మాపో చనిపోతాను. కానీ నా బిడ్డలతో పాటు చాలా మంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. వారందరికీ వాటర్ ఆక్సిజన్ చాలా అవసరం అయితే వీటితో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరమే కానీ హైదరాబాదులో ఎన్నో ప్రదేశాలు నిర్మానుషంగా ఉన్నాయి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మంచిది.

మీరు చాలా సీనియర్ నాయకులు, మీరు ఎన్నో విషయాల్లో చాలా అనుభవం కలిగిన వారు ఈ విషయంపై మరోసారి పునరాలోచన చేయండి ప్లీజ్..ఆ 400 ఎకరాలను వదిలేయండి. హార్ట్ ఫుల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్కసారి ఆలోచించండి.. మిగతా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.