Sridevi: శ్రీదేవి పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి అనంతరం హీరోయిన్గా అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈమె కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం కన్నడ మలయాళ హిందీ భోజపురి భాషలలో కూడా సినిమాలు చేశారు.
ఇలా అన్ని భాషలలోనూ స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇక శ్రీదేవి మరణించినప్పటికీ కూడా ఆమె అభిమానులు ఈమెకు సంబంధించి ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు ఇక శ్రీదేవి మరణం తర్వాత ఈమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెట్టి తల్లి లేని లోటును తీరుస్తున్నారు.
శ్రీదేవి కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈమె ప్రతి ఒక్క విషయంలోను చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట. ప్రతి పని చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను పెట్టేవారు అయితే తన కుటుంబ క్షేమం కోసమే శ్రీదేవి ఇలాంటి కండిషన్లను పెట్టే వారని తెలుస్తుంది అయితే శ్రీదేవి మరణం తర్వాత కూడా ఆమె పెట్టిన కండిషన్లను ఇప్పటికి తన కుటుంబం ఫాలో అవుతున్నారని చెప్పాలి.
ముఖ్యంగా ఇంట్లోనే నలుగురు కూర్చుని టిఫిన్ లంచ్ డిన్నర్ చేయాలని ఈమె ఆదేశాలు జారీ చేసేవారట అయితే భోజనం చేసేటప్పుడు ఎవరి చేతిలో కూడా మొబైల్ ఫోన్ కనపడకూడదు అలాగే టీవీ కూడా పెట్టకూడదు ఇంకా సినిమాలకు సంబంధించిన విషయాలను అసలు ప్రస్తావనకు తేకూడదని చెప్పేవారట. ఆ సమయంలో కుటుంబం గురించి కబుర్లు చెబుకుంటూ భోజనం చేయాలని చెప్పేవారట. ఇలా శ్రీదేవి మరణం తర్వాత కూడా ఆమె కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కన ఉండదని ఆమె పెట్టిన కండిషన్లను ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.