Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన జ్యోతిష్యులుగా ఎంతోమంది జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన వారి జాతకాలను చెబుతూ ఈయన వార్తలలో నిలచారు. ఇకపోతే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు వేణు స్వామి వద్ద ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకునేవారు.
ఈయన చేత పూజలు చేయించుకుంటే దోషాలు తొలగిపోయి తమ పనులలో విజయం సాధిస్తారని ఎంతోమంది ఈయన చేత పూజలు చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పే జాతకాల కారణంగా ఆయన వివాదాలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక జాతకం ద్వారా వార్తల్లో నిలవడమే కాకుండా వివాదాలను కూడా ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వేణు స్వామి ఇంటికి వైసీపీ కీలక నేత వెళ్లడంతో ఇది కాస్త చర్చలకు కారణం అవుతుంది. వైసిపి ఎమ్మెల్సీగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి హైదరాబాద్లోని వేణు స్వామి ఇంటికి వెళ్లారు. ఇలా ఈ ఇద్దరు వెళ్లడంతో వేణు స్వామి దంపతులు వీరికి సాధార స్వాగతం పలికారు అనంతరం వీరి కోసం వేణు స్వామి ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా దువ్వాడ శ్రీనివాస సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వేణు స్వామిని మర్యాదపూర్వకంగానే కలిసినట్టు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ మాత్రం విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవడం కోసం వీరిద్దరూ వేణు స్వామిని కలిసారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.