Nara Lokesh: తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ప్రకాశం జిల్లాలో పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ అధినేత అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ సంయుక్తంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంటును ప్రారంభించారు. బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని, ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 2.5 లక్షల మంది యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.’నా ధైర్యం, నా బ్రాండ్ ఒక్కడే..అదే చంద్రబాబు..తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు ఉంది.. మాకు చంద్రబాబు ఉన్నారు.
ఆయన ఈ రాష్ట్ర రూపురేఖలను మారుస్తారు.ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టోలో పెట్టాలని సీఎం చంద్రబాబును కోరాను అంటున్నారా లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదట గుర్తొచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడి ప్రజలకు పౌరుషం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ప్రకాశం జిల్లా ప్రజలకు టిడిపి అన్నా, చంద్రబాబు గారు అన్నా ఎనలేని ప్రేమ అని తెలిపారు రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర రూపురేకలే మారిపోతాయని లోకేష్ తెలిపారు.
2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో మీరంతా చూశారు. రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకు రాకపోగా ఉన్న కంపెనీలను తరిమేసారు. లులూ, అమర్ రాజా, హెచ్ఎస్బిసి, జాకీ లాంటి అనేక కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారంటూ గత ప్రభుత్వంపై నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు.