ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో అన్నం వండటానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ను వినియోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడటం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, ఉదాహరణకు: పోషకాలు తగ్గిపోవడం, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరగవచ్చు, అలాగే కీళ్ల నొప్పులు, ఉదర సంబంధిత సమస్యలు, అధిక బరువు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నంలో పోషకాలు మాయమవుతాయని, వంట చేసే సమయంలో అందులోనుండి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరగవచ్చని పరిశోధనల ద్వారా వెల్లడవుతోంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల చిన్న వయసులోనే కీళ్లనొప్పులు, ఉదర సంబంధిత సమస్యలు, అధికబరువు, నడుము నొప్పి, కీళ్లవాతం, డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
నాన్-స్టిక్ వస్తువులను ఉపయోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలయ్యే అవకాశం ఉండగ ఆ కెమికల్స్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో రైస్ కుక్కర్ పేలిపోవడం వల్ల ప్రమాదాలు కూడా సంభవించే ఛాన్స్ ఉంది. మరీ అవసరం అయితే తప్ప ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ను వాడటం మంచిది కాదు.
నాసిరకం రైస్ కుక్కర్లను వాడటం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నాసిరకం రైస్ కుక్కర్ల వల్ల దీర్ఘకాలంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైస్ కుక్కర్లను ఎక్కువగా వాడటం వల్ల లాభం కంటే నష్టం కలిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. రైస్ కుక్కర్లను తరచూ వాడే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.