Anil Ravipudi: అనిల్ రావిపూడి పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా లేకుండా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక ఈయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా వెంకటేష్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఫన్నీ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం మెగా 157 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతోంది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతుంది ఈ సినిమాకు సాహు గారపాటి, సుస్మిత కొణిదల నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం సంచలనగా మారింది. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇది అనిల్ రావిపూడి కెరియర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అని చెప్పాలి.
ఈయన మొదట దర్శకత్వం వహించిన పటాస్ సినిమాకు 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. అక్కడి నుంచి మొదలైన ఈయన ప్రయాణం 20 కోట్ల వరకు చేరుకుంది. ఇలా ప్రతి సినిమా సినిమాకు అనిల్ రావిపూడి గ్రాఫ్ పెరుగుతూనే ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయన డిమాండ్ చేసిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానకి నిర్మాతలు కూడా వెనకాడటం లేదు.