Y.S.Jagan: మీ నిబద్ధతకు రుణపడి ఉంటాను… రాబోయే రోజులు మనవే: వైయస్ జగన్

Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన సంగతి మనకు తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా ఈయన ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలలో కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.

మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, మీరు చూపిన ధైర్యానికి హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని తెలిపారు..మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఏ రోజు కూడా ఒక నాయకుడిగా వ్యవహరించలేదని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజలకు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడనీ తెలిపారు.

చంద్రబాబు ఒక మీటింగ్ పెడితే జనాలు ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు అయితే ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబుకు తెలిసిన కూడా మోసం చేస్తున్నారని తెలిపారు.రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది ఈసారి జగన్ కార్యకర్తల కోసం అండగా నిలబడతారు. కరోనా కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేక పోయి ఉండవచ్చు కానీ ఈసారి కార్యకర్తల కోసమే జగన్ పని చేస్తాడని తెలిపారు.