Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది ఈ సినిమా తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి.
ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా తన పెద్ద కుమార్తె సుస్మితకు చిరంజీవి వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా అనిల్ రావిపూడి ఒక ఫన్నీ వీడియోని క్రియేట్ చేశారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్ లతో ఈయన ఈ వీడియో చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు చిరంజీవి సినిమాలకు సంబంధించిన కటౌట్ పెట్టుకొని చిరంజీవి గురించి మాట్లాడుతూ వారిని వారు పరిచయం చేసుకున్నారు.
ఇక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వారు చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కటౌట్ పెట్టుకొని వారిని వారు పరిచయం చేసుకున్నారు. ఈ సినిమాకు సాహు గారుపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుస్మిత కొణిదల కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరు ఇక్కడికి రావడంతోనే నమస్తే సార్ నా పేరు సుస్మిత కొణిదెల నేను మీ సినిమాకు ప్రొడ్యూసర్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు.
ఇలా తన కుమార్తె పరిచయం చేసుకోవడంతో చిరంజీవి వెంటనే నీ ఇంటి పేరు ఏంటి అంటూ ప్రశ్నించారు. వెంటనే సుస్మిత కొణిదెల అని చెప్పడంతో ఆ ఇంటి పేరును చెడగొట్టొద్దు ఇంటిపేరును నిలబెట్టాలి ఆల్ ది బెస్ట్ అంటూ తన కూతురికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.