దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకి భారీ షాక్

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోస్ లిస్ట్ లో చేరిపోయాడు హీరో విజయ్ దేవరకొండ. “అర్జున్ రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విజయ్. రీసెంట్ గా రిలీజ్ అయిన “గీత గోవిందం” సినిమాలోని “ఇంకేం ఇంకేం కావాలే” సాంగ్ విజయ్ కి మరింత కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ కిక్ తగ్గకముందే రౌడీ అనే క్లోతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేసేశాడు ఈ సెన్సేషనల్ హీరో. అయితే ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ కి భారీ షాక్ తగిలింది.

గీత గోవిందంలో విజయ్ పాడిన “వాట్ ద ఎఫ్” పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా అట్టర్ ప్లాప్ అయ్యింది. నెటిజన్స్ నుండి విముఖత ఎదురైంది. ఆఖరికి విజయ్ వీరాభిమానులు కూడా ఈ పాటకి డిస్ లైక్స్ కొట్టారు. ఎక్కువ డిస్ లైక్స్ రావటంతో వెంటనే ఆ పాటని యూట్యూబ్ నుండి తొలగించేశారు టీమ్.

దీనిపై స్పందించారు ఈ సాంగ్ లిరిసిస్ట్ శ్రీమణి. ఆ పాటలోని కొన్ని వాక్యాలు కొంతమంది మనోభావాలను గాయపరిచాయని విమర్శలు వస్తున్నాయి. కానీ మా భావనని తప్పుగా అర్ధం చేసుకోవటం జరిగింది. ఎవరి మనోభావాలను కించపరచడం మా ఉద్దేశం కాదన్నారు. ఏది ఏమైనప్పటికి అందరి మనోభావాలను గౌరవించటం మా ప్రాధమిక ధర్మం. అందుకే ఆ పాటను తొలగించాము. పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించి, అర్ధవంతంగా మార్చి, త్వరలోనే సాంగ్ ని మళ్ళీ అప్ లోడ్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు శ్రీమణి.