The Good Side: హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో – హన్షితా రెడ్డి ప్రారంభించిన ‘ది గుడ్ సైడ్’

The Good Side: హైదరాబాద్, డిసెంబర్ 12, 2025: హైదరాబాద్ బ్యూటీ మరియు గ్రూమింగ్ రంగంలో నేడు ప్రత్యేకమైన కొత్త అడ్రస్‌గా ‘ది గుడ్ సైడ్’ జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది. ఫిల్మ్ ప్రొడ్యూసర్ హన్షితా రెడ్డి స్థాపించిన ఈ ప్రీమియమ్ లగ్జరీ మేకప్ స్టూడియో మరియు సలూన్‌ను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ హారిక కో-ఫౌండ్ చేశారు. లాంచ్ కార్యక్రమానికి ప్రముఖులు అల్లు స్నేహా రెడ్డి, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరై స్టూడియోను ఆవిష్కరించారు.

ది గుడ్ సైడ్ ఫిలాసఫీ ప్రకారం, మేకప్ ద్వారా వ్యక్తిత్వంలోని సహజ లక్షణాలను మరింత అందంగా ఎలివేట్ చేయడం ముఖ్యమని హన్షితా చెబుతున్నారు. “ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ సైడ్ ఉంటుంది. దాన్ని ఇంటెన్షన్, డీటైల్, ఆర్టిస్ట్‌రీతో హైలైట్ చేయడమే మా లక్ష్యం,” అని ఆమె పేర్కొన్నారు.

స్టూడియో ఇంటీరియర్స్ నేచర్‌-ఇన్‌స్పైర్డ్ థీమ్‌తో రూపొందించబడ్డాయి. ఎర్తీ టోన్స్, పచ్చటి ఎలిమెంట్స్, నీటి ప్రవాహాల్లాంటి ఫీచర్స్ క్లయింట్లకు ప్రశాంతంగా, ఎలిగెంట్‌గా అనిపించే అంబియెన్స్‌ను సృష్టిస్తున్నాయి.

ఈ స్టూడియో ప్రత్యేకతగా మూడు ఇంటర్‌కనెక్టెడ్ బ్రైడల్ మరియు VIP సూట్లు నిలుస్తున్నాయి. పెళ్లి కి సంబంధించిన events, ప్రత్యేక కార్యక్రమాలు లేదా ప్రైవేట్ ప్రిపరేషన్ సెషన్ల కోసం ఈ సూట్లు పూర్తి ప్రైవసీ మరియు కంఫర్ట్ అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

స్టూడియోలో ఏర్పాటు చేసిన బూటిక్ హై-టీ కేఫే క్లయింట్ల బ్యూటీ రిట్యువల్స్‌ను మరింత రిలాక్స్‌డ్ మరియు ఆనందదాయకంగా మార్చుతుంది. కూర్చొని స్వల్ప విరామం తీసుకుని రిఫ్రెష్మెంట్స్ ఆస్వాదించేలా ఈ కేఫే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.

ది గుడ్ సైడ్ సేవల్లో ప్రొఫెషనల్ మేకప్, హెయిర్‌స్టైలింగ్, అడ్వాన్స్‌డ్ హెయిర్‌కట్స్ మరియు కలరింగ్, లాషెస్, నైల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, సిగ్నేచర్ స్పా రిట్యువల్స్ ఉన్నాయి. రాబోయే నెలలో హైడ్రా ఫేషియల్స్ మరియు మెడి-ఫేషియల్స్‌ను కూడా ప్రారంభించనున్నారు. అదనంగా, ప్రీ-బ్రైడల్ మరియు ఈవెంట్ ప్రెప్ కోసం కస్టమైజ్డ్ ప్యాకేజేస్ కూడా అందుబాటులో ఉన్నాయి.

“హైదరాబాద్‌లో ఇప్పటివరకు కనిపించని luxury అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. మేకప్ నుంచి సలూన్ సేవల వరకు—అన్నీ ఒకే చోట. Let GLAM be the new YOU,” అని హన్షితా అన్నారు.

Public EXPOSED: Chandrababu Ruling And YS Jagan Ruling || Ap Public Talk || Pawan Kalyan || TR