ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్‌గా ఆ హీరో ఫిక్స్

తెలుగు సినీ పరిశ్రమ అనగానే గుర్తొచ్చే రెండు పేర్లు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీరిద్దరూ తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా భావిస్తారు. క్రిష్ దర్శకత్వంలో, బాలకృష్ణ ఎన్టీఆర్ లా కనిపించనున్న బయోపిక్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్ర కూడా కీలకం. వీరిద్దరూ కలిసి ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆణిముత్యాలుగా నిలిచాయి, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అందుకే అభిమానులు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఏఎన్నార్ క్యారెక్టర్ ఉండాలని ఆశిస్తున్నారు.

ఎన్టీఆర్ క్యారెక్టర్ బాలకృష్ణ చేస్తున్నాడు కాబట్టి ఏఎన్నార్ ని నాగార్జునలోనో, అఖిల్, చైతులలోనో ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. కానీ దీనికి భిన్నంగా ఏఎన్నార్ పాత్రకి ఏఎన్నార్ కూతురి కొడుకు సుమంత్ ని ఖరారు చేశాడు క్రిష్. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు తెలిపాడు హీరో సుమంత్. ఈ టీంలో కలవటం చాలా గర్వంగానూ ఆసక్తిగానూ ఉంది. ఎన్టీఆర్ లాంటి ప్రెస్టీజియస్ సినిమాలో ఏఎన్నార్ గా కనిపించనున్నాను. అని ట్వీట్ చేశాడు సుమంత్.

 

ఈ బయోపిక్ లో బసవ తారకంలా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్నారు. రానా సీఎం చంద్రబాబు నాయుడుగా కనిపిస్తున్నాడు. బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.