ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన బిగ్ బాస్ బ్యూటీ.. గైర్హాజరైన చిన్నోడు, పెద్దోడు!

బిగ్ బాస్ సీజన్ 8 కంటెంట్ సోనియా ఆకుల వివాహం తను ప్రేమించిన వ్యక్తి యష్ తో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ తో పాటు గత సీజన్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ బ్రాండ్ అనే టాగ్ ని అందుకున్న సోనియాది తెలంగాణలోని మంథని.

ముందు యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ భామ రాంగోపాల్ వర్మ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. స్టార్టింగ్ లో ఈమె వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించినా హౌస్ లోకి వెళ్ళిన రెండో వారంలోనే నిఖిల్,పృద్విలకు బాగా దగ్గరయింది. వాళ్ళిద్దరితోనే క్లోజ్ గా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందా అని అభిమానులకి డౌట్ వచ్చేలోపే పెద్దోడు చిన్నోడు అంటూ నాలుక మడత పెట్టేసింది.

అయితే ఈ లోగా ఆమె పూర్తి నెగిటివిటీని మూట కట్టుకోవడం వలన షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఫైనల్ గా హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె యష్ తో నిశ్చితార్థం జరుపుకుంది. శుక్రవారం గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకుంది. ఈ పెళ్లికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ తేజ, రోహిణి, మణికంఠ, నైనిక అటెండ్ అయ్యారు. అలాగే అమర్ దీప్, తేజస్విని కూడా ఈ పెళ్లికి వచ్చారు. అయితే పెద్దోడు చిన్నోడు అయిన నిఖిల్, పృధ్వి మాత్రం పెళ్ళికి హాజరు కాలేదు.

దీంతో వాళ్లు పెళ్లికి హాజరు కాకపోవడానికి కారణమేమిటో అంటూ ఆరాలు చేస్తున్నారు నెటిజన్స్. అయితే సోనియా ఆకుల గురించి మనెవరికి తెలియని విషయం ఏమిటంటే ఆమె ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నడిపిస్తుంది. ఈ విషయం తెలిసి చాలా మందికి ఆమెపై రెస్పెక్ట్ పెరిగింది. ఇకపోతే రోహిణి పోస్ట్ చేసిన సోనియా ఆకుల పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.