ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పుల సమస్య సర్వ సాధారణం అయింది. యుక్త వయస్సులోనే చాలామంది కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. అర్థరైటిస్ బారిన ఒకసారి పడితే ఆ నొప్పులు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా కొంతమందిలో ఎలాంటి ఫలితం ఉండదు. అదే సమయంలో పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొన్ని ఆహారాలు తినడం వల్ల నొప్పి మళ్లీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లు పాలు, పెరుగు, ఇతర డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాలు శరీరానికి హాని కలిగిస్తాయి.
రెడ్ మీట్ తింటే కూడా కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. చేపలు, బీన్స్ తినడం వల్ల అర్థరైటిస్ కు చెక్ పెట్టవచ్చు. సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇన్ ఫ్లమేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా నొప్పి పెరుగుతుంది. అన్ శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి సైతం వెళ్లకూడదు.
హెల్త్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య శాశ్వతంగా దూరమవుతుందని చెప్పవచ్చు. కీళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. అర్థరైటిస్ వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.