ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడానికి చాలా సమయం పడుతోంది. ఇప్పటికే 10 రూపాయల నాణేలు చెల్లడం లేదని ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో 5 రూపాయల నాణేలు రద్దవుతాయా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే వాస్తవం ఏంటంటే 5 రూపాయల నాణేలు ఎప్పటికీ రద్దయ్యే ఛాన్స్ లేదు.
అయితే బ్లేడ్లను తయారు చేయడానికి వినియోగిస్తున్న 5 రూపాయల నాణెం చలామణిలో తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇత్తడితో చేసిన 5 రూపాయల నాణేలు అప్పుడూ ఇప్పుడూ ఎప్పటికీ చలామణిలో ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పవచ్చు. కొంతమంది కావాలనే ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తుండటం గమనార్హం.
ఆర్బీఐ అధికారికంగా నాణేలు, నోట్ల రద్దు గురించి చెబితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు సైతం ఈ తరహా తప్పుడు వార్తలను ప్రచారంలోకి తెస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. 5 రూపాయల నాణేలు కలిగి ఉన్నవాళ్లు ఈ కాయిన్ల విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
5 రూపాయల కాయిన్లకు సంబంధించి అనవసరపు అనుమనాలను పెట్టుకోవద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 5 రూపాయల నాణేల విషయంలో అపోహలను ప్రచారం చేయవద్దని అధికారులు సైతం కోరుతున్నారు.