కెరియర్ లో ఆ క్యారెక్టర్ కోసమే ఎక్కువ కష్టపడ్డాను.. మరోసారి మానవత్వం చాటుకుంటున్న సోనూసూద్!

విలక్షణ నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అతను నటన ద్వారా ఎంతగా ప్రజల మనసుని దోచుకున్నాడో సేవా కార్యక్రమాల ద్వారా అంతగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అరుంధతి సినిమాలో వదల బొమ్మాళి వదల అంటూ చెప్పిన డైలాగ్ చెప్పి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ డైలాగ్ తోనే సోనుసూద్ ని చాలామంది గుర్తుపడతారు. అంతగా ఆ డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు సోను సూద్.

అయితే ఇన్నాళ్లు తన నటనతో మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు డైరెక్షన్ లో కూడా తన ప్రతిభ చాటుకోబోతున్నాడు. ఫతేహ్ టైటిల్ తో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో తాను హీరోగా జాక్విలిన్ ఫెర్నాన్డేజ్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోనూసూద్ పలు ఇంటర్వ్యూలకి హాజరవుతున్నాడు. అందులో భాగంగా తన కెరీర్ కి సంబంధించిన విషయాలని షేర్ చేసుకున్నాడు.

నా కెరియర్ లో బాగా కష్టపడిన పాత్ర అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర. మేకప్ కే ఆరు ఏడు గంటల సమయం పట్టేది. ఆ మేకప్ వల్ల శరీరంపై దద్దుర్లు వచ్చేవి. సినిమా షూటింగ్ రోజంతా జరుగుతూనే ఉండేది. అయితే సినిమా విడుదల తర్వాత ముంబై నుంచి మళ్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ చూసి ఆశ్చర్యపోయాను. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారు అప్పుడు అర్థం చేసుకున్నాను.

ఈ సినిమా వచ్చి 15 ఏళ్ళు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పాడు. ఇక తాను దర్శకత్వం వహిస్తున్న పతే సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కలెక్షన్ల సొమ్ముని వృద్ధాశ్రమాలకి, అనాధాశ్రమాలకి పంపించే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పాడు. దీంతో అతని మంచి మనసుని మరొకసారి మెచ్చుకుంటున్నారు ఆయన అభిమానులు ఈ సినిమా ని సోనూసూద్ భార్య సోనాలి సూద్ నిర్మించడం గమనార్హం.