బాధితురాలి పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. సినిమా రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసిన నిర్మాతలు!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈమె చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది అనుపమ పరమేశ్వరన్. ముందు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసిన అనుపమ పరమేశ్వరన్ రూట్ మార్చి ఈమధ్య వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో ఒక రేంజ్ లో అందాలని ఆరబోసింది.

ఇక తాజాగా ఆమె జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా తో మన ముందుకి వస్తుంది.
సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యదార్ధ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాని కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జే.ఫణీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. ఇన్ టెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది.

జానకిపై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అనే అంశాన్ని ఇంటెన్సీ డ్రామాగా నిర్మించారు. ఈ కేసుని వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటించారు. ఈయన బిజెపి తరఫున లోక్సభకు ఎన్నికై తొలిసారిగా కేంద్రమంత్రి అయ్యారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యాక ఆయన నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో బైజు సంతోష్, మాధవ్, సురేష్ గోపి, దివ్య పెళ్ళై ఈ సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ పోటా పోటీగా నటించారు . ఇదివరకే మలయాళం లో విడుదలై మంచి హిట్ కొట్టిన ఈ సినిమాని అదే టైటిల్ తో తెలుగులో నిర్మిస్తున్నారు. రియల్ స్టోరీ కావటం అందులోని మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా కావటంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.