ఆ పోలీసు తనను వేధించాడంటున్న హీరోయిన్ శృతి

ఏసీపీ స్థాయి పోలీసు అధికారి  తనను లైంగికంగా వేధించారని ఓ  నటి వాపోతుంది. పలు కేసులలో అరెస్టయిన నటి తనను పోలీసులే లైంగికంగా వేధించారనటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ నటి శృతి. వివాహం ఆశచూపి ఇంజనీర్లను, కోటిశ్వర్లను, యువతను మోసం చేసిన కేసులో శృతి, ఆమె తల్లి చిత్ర సహా నలుగురిని  పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారిని కోవై జైలుకు తరలించారు. కండిషన్ బైలుపై  ఆ నటి విడుదలైంది. తాను ఎవరినీ వివాహం చేసుకుంటానని చెప్పలేదని, పోలీసులు జైలులో తనను నానా టార్చర్ చేశారని ఆమె ఆరోపించింది. మేల్ ఏసీపీ తనకు సెక్సువల్ ఫేవర్ కావాలని బలవంతం చేశారని దానిని ఓ మహిళా పోలీసే వీడియో చిత్రీకరించదని ఆమె ఆరోపణలు చేసింది.  విచారణ ముగియగానే దీనిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని ఆమె మీడియాకు తెలిపింది. శృతి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.