ఎన్టీఆర్ ‘బయోపిక్’ : కాంగ్రేస్ కు బదులుగా ఆ పదం వాడతారు

ఇప్పటికే మారిన రాజకీయ సమీకరణాలతో ఎన్టీఆర్ బయోపిక్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్న సంగతి తెలిసిందే. సినిమా స్క్రిప్టు ప్రకారం..కాంగ్రేస్ విలన్ . కాంగ్రేస్ ని ఎదుర్కోవటానికి ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో ఏం చేసారు అనే యాంగిల్ లో సెకండ్ పార్ట్ మహా నాయకుడు తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్దితుల్లో చంద్రబాబు,కాంగ్రేస్ కలిసారు. దాంతో ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీని విమర్శించకూడదు . అయితే ఇప్పటికే ఈ సీన్స్ అన్నీ తీసేశారు . ఏం చేయాలి…అని గత కొద్ది రోజులుగా క్రిష్ తలపట్టుకు కూర్చున్నారు.

 
 
అందుతున్న సమాచారం ప్రకారం దీనికి మధ్యే మార్గంగా ఓ పరిష్కారం అనుకున్నారని, దానికి బాలయ్య సైతం సై అన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇంతకీ ఏమిటా పరిష్కారం అంటే… కాంగ్రేస్ అని వచ్చినప్పుడల్లా కేంద్రం అని వచ్చేలా. ఓ రకంగా ఇప్పుడు కేంద్రలో ఉన్నది బిజేపి కాబట్టి…దానికి వ్యతిరేకం అనేది కూడా ఇండైరక్ట్ గా వచ్చే అవకాసం ఉంది. అప్పటిరాజకీయాలు తెలిసిన వారికి కాంగ్రేస్ అనకపోయినా విషయం తెలుస్తుంది. అలా ఈ సమస్యను తెలివిగా పరిష్కరించారని తెలుస్తోంది.
 
 

ఇక ఈ సినిమాలో విద్యా బాలన్ , రానా, సుమంత్ , కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ , తమన్నా , కైకాల సత్యనారాయణ , ప్రకాష్ రాజ్, నరేష్ పూనమ్ బజ్వా ,మంజిమా మోహన్ , హిమన్షి చౌదరి , భరత్ రెడ్డి నటిస్తున్నారు .

మొదట అనుకున్న నిడివి కన్నా ఎక్కువ రావడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని బాలకృష్ణ ప్రకటించాడు . 2019 జనవరి 9 అన్న ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం (1983 జనవరి 9 ) చేసిన రోజున “ఎన్టీఆర్ మహా నటుడు” అనే సినిమా విడుదల అవుతుందని , జనవరి 24 న “ఎన్టీఆర్ మహా నాయకుడు ” అనే సినిమా విడుదల చేస్తారు.