Kantara Pre-release: కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.
బాలకృష్ణకు పేర్ని నాని సవాల్: ‘తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పు, నాకు ఫోన్ చేయలేదని!’
అస్వస్థతపై పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు ఆకాంక్ష

హైప్‌ను నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్తు సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో మ్యాసీవ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను టీం అనౌన్స్ చేసింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఎన్టీఆర్ హాజరుకావడంతో సినిమా ప్రీ-రిలీజ్ ప్రమోషన్‌కి మరింత బలాన్ని చేకూర్చనున్నారు.
మైథాలజీ, రీజినల్ ట్రెడిషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా ఉండబోతోంది.
అక్టోబర్ 2వ తేదీకి కౌంట్‌డౌన్ మొదలుకావడంతో ‘కాంతార: చాప్టర్ 1’ ఈ ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.

