వివాదం మొదలైంది: ‘2.0 పై సెన్సార్‌ బోర్డుకు కంప్లైంట్

ఈ రోజుల్లో వివాదం లేనిదే ఏ పెద్ద సినిమా రిలీజ్ కావటం. చూసి చూసి సినిమా రిలీజ్ కు ముందే వివాదాలు మొదలవుతాయి. ఇప్పుడు ఎస్‌ శంకర్‌ అద్భుత సృష్టిగా చెప్పబడుతున్న ‘2.0 పై వివాదం అలుముకుంది. ఈ మూవీలో మొబైల్‌ ఫోన్‌, టవర్లు, మొబైల్‌ సేవలపై చిత్ర దర్శక,నిర్మాతలు అశాస్ర్తీయ ప్రచారం చేశారని సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) ‌) సెన్సార్‌బోర్డు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది.

ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ పోషించిన పాత్ర ద్వారా మొబైల్‌ ఫోన్‌ వాడకందారులను పర్యావరణానికి పక్షులు, జంతువులకు రేడియేషన్‌తో హాని చేసే వారిలా దూషిస్తుంటారని పేర్కొంది. టీజర్‌, ట్రైలర్‌లలో మొబైల్‌ఫోన్లు, టవర్లు పర్యావరణానికి హానికరం అన్న రీతిలో చూపించారని దీనిపై సెన్సార్‌బోర్డు మరోసారి పునః సమీక్ష జరపాలని ఫిర్యాదులో పేర్కొంది.

‘‘మొబైల్‌ ఫోన్లు, టవర్లు పక్షులకు హాని కలిగిస్తాయని చిత్రంలో తప్పుగా చూపించారు’’ అని కాయ్‌ అభిప్రాయపడుతూ ఈ కంప్లైంట్ చేసింది. అక్షయ్‌ ఇందులో పక్షి ప్రేమికుడిగా కనిపిస్తారని సమాచారం. సెల్‌ఫోన్‌, సెల్‌ టవర్ల వల్ల పక్షులకు జరిగిన హానికి ప్రతీకారంగా పోరాటం చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌బోర్డుకు కాయ్‌ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సెల్‌ఫోన్‌ వల్ల పర్యావరణానికి హాని జరిగినట్లు శాస్త్రీయంగా ఎక్కడా రుజువుకాలేదని పేర్కొంది.

టీజర్‌, ట్రైలర్‌, ఇతర ప్రమోషనల్‌ వీడియోతో పాటు సినిమా తమిళ వెర్షన్‌కు ఇచ్చన సర్టిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించాలని ఈ లెటర్ లో సెన్సార్‌ బోర్డుకు రిక్వెస్ట్ చేసింది. ఈ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటలకే ఈ కంప్లైంట్ వెలుగుచూడటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.