Shankar: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శంకర్ ఇటీవల కాలంలో చేసే సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు శంకర్ సినిమాలు అంటే కచ్చితంగా అద్భుతమైన విజయాలను అందుకునేవనే నమ్మకం అందరిలోనూ ఉండేది అలాగే శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది. అయితే ఇటీవల శంకర్ సినిమాలలో తన మార్క్ కనిపించడం లేదని చెప్పాలి. ఇటీవల అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండియన్ 2, అలాగే గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.
ఈ రెండు సినిమాల కోసం భారీ స్థాయిలోనే బడ్జెట్ కేటాయించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇక ఈ సినిమాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న శంకర్ మాత్రం ఎక్కడా ఈ సినిమాల అపజయాల గురించి స్పందించలేదు. ఇలా ఈ సినిమాలు డిజాస్టర్ కావడంతో శంకర్ కు సినిమా అవకాశాలు వచ్చేది కూడా కష్టమేనని అందరూ భావించారు అయితే ఈయన మాత్రమే ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా తమిళ ఎపిక్ నవల “వెల్పరి” ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనున్నారని తెలుస్తోంది. ఇలా శంకర్ వెయ్యికోట్ల బడ్జెట్ సినిమా గురించి తెలియజేయడంతో పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 1000 కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేసి మళ్లీ ఏ నిర్మాతను ముంచేయాలనుకుంటున్నారా అంటూ దారుణంగా శంకర్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా భారీ డిజాస్టర్ల తర్వాత ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టి శంకర్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
