Shankar: శంకర్ నెక్స్ట్.. ఆ హీరో ఓకే చెబుతాడా?

ఇండియన్ సినిమా మార్కెట్‌లో శంకర్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ‘ఇండియన్ 2’ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడం, ‘గేమ్‌ ఛేంజర్’ డిజాస్టర్ కావడం వలన, శంకర్ క్రేజ్ కొంత తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడూ విజువల్‌ వండర్‌లను మేనేజ్ చేసే శంకర్, ఇప్పుడు కథా పరంగా బ్యాలెన్స్ చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ‘ఇండియన్ 3’ షూటింగ్ చాలావరకు పూర్తయినప్పటికీ, ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దానిపై అంతగా ఆసక్తి చూపడం లేదనే టాక్ ఉంది. ఇక భారీ బడ్జెట్, ఆర్థిక నష్టాల కారణంగా, ఈ ప్రాజెక్ట్‌ కోసం రెడ్ జెయింట్ పిక్చర్స్ అనే మరో సంస్థ రంగంలోకి దిగుతోంది. ఇక భవిష్యత్తులో ఈ సినిమా మళ్లీ ఎటువంటి మార్పులకు లోనవుతుందనే ప్రశ్నను తెరపైకి తెచ్చింది. దీంతో శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల శంకర్ తన నెక్స్ట్ మూవీ కోసం ప్రముఖ తమిళ నవల ‘వేల్పూరి’ ఆధారంగా కథ సిద్ధం చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు. అయితే, ఇందులో హీరో ఎవరు అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను అజిత్‌తో చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ అజిత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే చర్చలు జరుగుతాయని అంటున్నారు.

అజిత్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం, ఆయన కెరీర్‌లో కీలకమైనదిగా మారనుంది. ఈ సినిమా విజయం ఆధారంగా, ఆయన తదుపరి ప్రాజెక్టులు ఎలా ఉంటాయో స్పష్టత రానుంది. ఒకవేళ అజిత్ శంకర్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కాంబినేషన్ మరో భారీ విజువల్ ట్రీట్‌ను తెరపైకి తీసుకురావడం ఖాయం. మరి శంకర్ కథకు అజిత్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Tulasi Reddy Great Words About Indian Physicist CV Raman | Telugu Rajyam