మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటివరకూ పెద్దగా ప్రమోషన్ లేదు కానీ …ఒకే ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. అదేమిటంటే..ఈ సినిమాలో చివరి సాంగ్ ..ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఏ పాటకు ఖర్చుపెట్టనంత భారీ మొత్తం పెడుతున్నారని.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చివరి పాట షూటింగ్ కూడా మొదలైందట. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఖానాపూర్‌లో ఒక భారీ సెట్‌ను ఇప్పటికే నిర్మించారట. ప్రస్తుతం ఆ సెట్‌లోనే చివరి పాట షూటింగ్ జరుగుతోందని తెలిసింది. ఈ పాట భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే దాదాపు 800 మంది డ్యాన్సర్లు ఈ పాటలో చరణ్‌తో కలిసి స్టెప్పులేస్తారట. ఈ పాట సినిమా మొత్తం మీద హైలైట్‌గా నిలుస్తుందని తెలిసింది.
ఇదిలాఉండగా ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో ఈనెల 27న నిర్వహించేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో భారీ పోటీ మధ్య ఈ సినిమా విడుదలకానుంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అళాగే మాజీ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.