Home Tollywood ‘2.0’కొత్త రికార్డ్ : ఆ మల్టిప్లెక్స్ లో 100 షోలు!

‘2.0’కొత్త రికార్డ్ : ఆ మల్టిప్లెక్స్ లో 100 షోలు!

2.O2 | Telugu Rajyam

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కోటి బయటికొస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయం. అలాగే షోలు విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డ్ లకు శ్రీకారం చుడుతోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మార్నింగ్‌ షోను ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని డిస్టిబ్యూటర్స్ భావిస్తున్నారట. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని, తిరుచ్చిలో 20 కన్నా ఎక్కువ మార్నింగ్‌ షోలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్తున్నారు.

2.O | Telugu Rajyam

అంతేకాదు దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ VOX సినిమాస్‌లో ‘2.0’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి డిస్టిబ్యూటర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఏ రేంజిలో సంచలనం సృష్టించబోతో అర్దం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

2010 సూపర్‌ హిట్‌ ‘రోబో’కు స్వీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘2.ఓ’. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ విలన్ పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. భారత చిత్ర పరిశ్రమలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Robo2 | Telugu Rajyam
సైంటిస్ట్‌ వశీకరణ్‌, రోబో చిట్టి పాత్రలే కాకుండా మరో మూడు పాత్రల్లో రజనీ నటిస్తుండగా, రావణుడి తరహాలోనే అక్షయ్‌ కుమార్‌ ఏకంగా 10 పాత్రల్లో కనిపి స్తారని చెప్పుకుంటున్నారు. టెక్నాలజీపరంగా చూస్తూ 2డి, 3డి, ఐమాక్స్‌ 3డి, ఐమాక్స్‌ రియల్‌ 3డి ఫార్మాట్లలో డాల్బీ అట్మాస్‌ కంటే ఉత్తమమైన సౌండ్‌ టెక్నాలజీతో ‘2.0’ను తీర్చి దిద్దుతున్నారు శంకర్‌.2.0 నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

- Advertisement -

Related Posts

బాలీవుడ్ అయితే ఏంటి.. మహానటి తగ్గట్లేదుగా!

మహానటి సినిమాతో తన హావభావాలతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన క్యూట్ గర్ల్ కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు...

అక్కడ.. మరో మాస్టర్ కావాలట

కరోనా లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న చిత్రం మాస్టర్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో పాజిటివ్ టాక్ ను అందుకోకపోయినా...

వరుణ్ తేజ్ బాక్సింగ్.. స్పెషల్ అప్డేట్ రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులయ్యింది. చివరగా 2019లో గద్దల కొండ గణేష్, F2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ ఆ తరువాత...

ప్రభాస్, యష్ కాంబో.. కొంచెం చూడండి బయ్యా

బాహుబలితో సెట్ చేసిన ఒక బిగ్గెస్ట్ రికార్డుతో ప్రభాస్ పాన్ ఇండియా అనే దారిని మరింత పెద్దది చేయగా KGF చాప్టర్ 1తో యష్ కూడా మరో దారిని సెట్ చేశాడు. ఇటీవల...

Latest News