Nara Lokesh: జగన్ ఇక నువ్వు మారవా… తిరుమల ఘటనపై ఫైర్ అయిన మంత్రి లోకేష్?

Nara Lokesh: పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు భక్తులకు ఎంతో ఆవేదనను కలిగిస్తున్నాయి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తిరుపతిలో ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూటమి ప్రభుత్వాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎంతోమంది తిరుమల కొండపై రీల్స్ చేస్తూ తిరుమల పవిత్రతను బ్రష్టు పట్టిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తిరుపతిలోని అన్నమయ్య విగ్రహం పై క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంటా క్లాస్ టోపీ పెట్టడం పట్ల ఒక్కసారిగా ఆందోళన నెలకొంది ఇలా శ్రీవారికి పరమ భక్తుడు అయినటువంటి అన్నమయ్య విగ్రహంపై శాంటా క్లాస్ టోపీ పెట్టడంతో మరోసారి తిరుమల పవిత్రత మంట కలిసింది అంటూ వైకాపా నేత మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.

ఇలా తిరుమల ఘటన గురించి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు బజరంగ్ దళాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నాయకుల పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ ట్వీట్ చేస్తూ..జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలదా? ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు.. శాంటా క్లాజ్‌ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా తిరుమల, తిరుపతి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు అంటూ ఈయన కౌంటర్ ఇచ్చారు.

ఇకపోతే ఈ విషయంపై పలువురు వైకాపా కార్యకర్తలు నేటిజన్స్ స్పందిస్తూ అధికారంలో మీరు ఉన్నారు కనుక ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి కానీ ఇలా ప్రతిపక్ష పార్టీపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం తగదని వెంటనే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.