Surekha: మేనల్లుడి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సురేఖ… స్నేహ రెడ్డి కూడా ఇలా చేయలేదేమో?

Surekha: చిరంజీవి సతీమణి సురేఖ గురించి అందరికీ సుపరిచితమే ఈమె తన కుటుంబ సభ్యులందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు. తన మరిది గారు చెల్లెళ్లు అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సొంత పిల్లలలా చూసుకుంటూ ఉంటారు ఇక అల్లు అర్జున్ విషయంలో సురేఖ ఎంతో చొరవ చూపుతారు చిన్నప్పటినుంచి సురేఖ వద్దే పెరిగిన అల్లు అర్జున్ తనని కూడా సొంత కొడుకు లాగా భావిస్తుంది అల్లు అర్జున్ కి కూడా తన మేనత్త అంటే విపరీతమైనటువంటి ప్రేమ.

ఇక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని పలు సందర్భాలలో బయటపెట్టారు. తన అల్లుడికి కష్టం వస్తే అత్త హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నారు ఇక తన అల్లుడు జైలు నుంచి బయటకు రావడంతో తనని చూడడం కోసం సురేఖ తన అన్నయ్య ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి సందర్భంలోనూ అల్లు అర్జున్ సురేఖ మధ్య ఉన్నటువంటి బాండింగ్ బయట పడుతూనే ఉంది. తన భర్త కొడుకు స్టార్ హీరోలైన తన ఇంట్లో ఎంతో మంది హీరోలు ఉన్నా సురేఖకు మాత్రం తన అల్లుడు బన్నీ సినిమాలంటేనే చాలా ఇష్టం అని తెలుస్తుంది.

ఇలా తనకెంతో ఇష్టమైన తన మేనల్లుడు ప్రస్తుతం ఈ వివాదంలో చిక్కుకోవడంతో సురేఖ కూడా చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన అల్లుడి క్షేమం కోసం తన అల్లుడిపై పడిన దిష్టి తొలగిపోవడం కోసం ఈమె సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ కేసు నుంచి అల్లు అర్జున్ పూర్తిగా బయటపడటం కోసం ఈమె గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించడమే కాకుండా ఏకంగా వెయ్యి మందికి అన్నదానం చేయాలని భావించారట అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మీది నిజంగా ఎంతో మంచి మనసు అంటూ సురేఖ నిర్ణయం పై కామెంట్లు చేస్తున్నారు.