పవర్ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన దర్శకుడు బాబి అలియాస్ కేఎస్ రవీంద్ర ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణతో డాకు మహారాజ్ అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.
అలాగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాబి అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక మూవీ నిర్మాణ సంస్థ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా పేరు చెప్పను కానీ బడ్జెట్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సినిమా హిట్ అయింది గానీ నేను అడిగినంత బడ్జెట్ పెట్టి ఉంటే ఆ సినిమా స్థాయి వేరే లెవెల్ లో ఉండేది అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు బాబి.
అయితే పేరు చెప్పకపోయినా ఆ నిర్మాణ సంస్థ ఏమిటో, ఆ నిర్మాత ఎవరో ఇట్టే పసిగట్టేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అని ఆ నిర్మాత కళ్యాణ్ రామ్ అని స్వయంగా ఎన్టీఆర్ అభిమానులే అంటున్నారు. ఇటీవల దేవర సినిమా నిర్మాణంలో కూడా ఈ సంస్థ అనేక విమర్శలని ఎదుర్కోవటం గమనార్హం. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలకు తగ్గట్టు లేవంటూ ఎన్టీఆర్ ఫ్యాన్సే తిట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడటం మామూలే.
ఇకనైనా నిర్మాణ విలువలు పై ఈ ప్రొడక్షన్ హౌస్ దృష్టి సారించడం మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే ప్రేక్షకుల ఊహాగానాలు నిజమా కాదా అనేది ఆ డైరెక్టర్ కే తెలియాలి. ఇక డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులే కాదు సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అంతగా ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి మరి.