నేచురల్ స్టార్ నాని మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ ‘HIT: The 3rd Case’ లో ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుంది.
క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నాని బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సన్ గ్లాసెస్ ధరించి స్టయిలీష్ అవతార్ లో కనిపించారు. బ్లాక్ హార్స్ కళ్ళెం పట్టుకొని డైనమిక్ లుక్ లో కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ లో మంచుతో నిండిన మౌంటెన్ ల్యాండ్ స్కేప్ విజువల్ ఫీస్ట్ లా వుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు టాకీని చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. నాని క్యారెక్టర్ గ్లింప్స్ లో చూపినట్లుగా, ఇంటెన్స్, ఫెరోషియస్ గా ఉంటుంది.
తన పాత్ర టఫ్, డైనమిక్ పర్సోనకి సరిపోయేలా నాని అద్భుతంగా మేక్ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
HIT 3 మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సౌండ్ మిక్స్: సురేన్ జి
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు
SFX: సింక్ సినిమా
VFX సూపర్‌వైజర్: VFX DTM
DI: B2h స్టూడియోస్
కలర్స్: S రఘునాథ్ వర్మ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో