AP: వైసీపీ ఘోర ఓటమికి ఇద్దరే కారణం… వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు!

AP: ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్ గా విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో 175 స్థానాలను టార్గెట్ చేశారు అయితే ఈ ఎన్నికలలో మాత్రం ఎవరు ఊహించని విధంగా కేవలం జగన్ 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతూ ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయారు.

ఈ విధంగా వైకాపా అందుకున్నటువంటి ఈ పరాజయం నుంచి ఇప్పటికి కూడా అభిమానులు నేతలు బయట పడలేదని చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎందుకు ఓడిపోయారు అనే అంశంపై సర్వత్ర సందేహాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ఇద్దరే ప్రధాన కారణమని తెలిపారు. వారిలో ఒకరు చంద్రబాబు నాయుడు ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సాధ్యం కానీ హామీలను ఇవ్వలేక నిజం చెప్పటం వల్లే పార్టీ ఓటమికి కూడా కారణం. ఇక చంద్రబాబు నాయుడు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయటం కూడా మా పార్టీ ఓటమికి మరో కారణమని తెలిపారు.

ఈ విధంగా వైసిపి ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటూ రాచమల్లు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని నేటిజన్స్ కూడా భావిస్తున్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అందిస్తానని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు .అయితే ఆ హామీలకు ఆశపడిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ ప్రస్తుతం మాత్రం ఎంతో పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పటికీ కూడా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని రాచమల్లు ఫైర్ అయ్యారు.