తెలుగు ఇండస్ట్రీలో నుంచి సరైన సీక్వెల్ బాహుబలి 2 పడిన తర్వాత భారతీయ సినిమా దగ్గర సీక్వెల్స్ ఫార్మాట్ మొత్తం మారిపోయింది అనటం లో ఎలాంటి అనుమానం లేదు.ఇప్పుడు వస్తున్న సీక్వెల్స్‌కు కానీ సీక్వెల్ చేయాలి అనుకున్న సినిమాలు డెఫినెట్‌గా బాహుబలి 2 గురించి,దాని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తావన లేకుండా ఉండదు.
ఇలా సీక్వెల్స్ లో మన తెలుగు సినిమా ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తే ఇపుడు మళ్ళీ మన తెలుగు సినిమానే ఈ సీక్వెల్స్ అర్ధాన్ని రీడిఫైన్ చేస్తుందని చెప్పాలి. కాగా ఇండియన్ సినిమా దగ్గర జనం ఓ సీక్వెల్ కోసం అంతలా ఎదురు చూసింది ఏదన్నా ఉంది అంటే అప్పుడు బాహుబలి 2, దాని తర్వాత కన్నడ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 అని చెప్పాలి. వీటితో పాటుగా వీటి తరహాలో ఒక క్రేజీ క్లైమాక్స్ ఎండింగ్ లేకపోయినా కూడా ఇండియా వైడ్ రూల్ చేసిన సినిమా మాత్రం పుష్ప 2.పుష్ప 2 సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
విడుదలకు ముందే పుష్ప 2 ప్రభంజనం మొదలైంది. రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. థియేట్రికల్ రైట్స్ రూ. 600 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. థియేటర్స్ లోకి రాకముందే పుష్ప 2 మూవీ నిర్మాతలకు లాభాలు పంచింది. కాగా మరో మూడు వందల కోట్ల వసూళ్లు రాబడితే పుష్ప 2 ఏకంగా బాహుబలి 2 రికార్డుని సైతం అధిగమిస్తుంది.2017లో విడుదలైన బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1810 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. కాబట్టి పుష్ప 2 ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి 2 నెలకొల్పిన అత్యధిక వసూళ్ల రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే అంటున్నారు. కాగా దంగల్ మూవీ రూ. 2000 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ముందు ముందు పోస్ట్ పార్టీకి పోటీగా వచ్చేసి సినిమాలేవి లేకపోవడంలో కూడా ఆ రికార్డ్స్ కూడా కొల్లగొట్టే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.