ప్రభాస్ అలా చెప్పడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.. డ్రింకర్ సాయి హీరో ధర్మ కామెంట్స్!

నూతన నటుడు ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్రింకర్‌ సాయి’. ‘బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ ఉపశీర్షిక. కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు.హీరో ధర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాను మా ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషనేట్ గా నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువని తెలిసినా కథను నమ్మి వారు కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా డబ్బు కోసం కాకుండా సినిమాను ఇష్టపడి వర్క్ చేశారు. నేను హీరో అవుదామనే ఇండస్రీకి వచ్చాను. హీరోగానే బతుకుతాను, హీరోగానే చచ్చిపోతా. హీరో అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఇది నా డ్రీమ్. చిన్న సినిమాల ట్రైలర్, టీజర్ బాగుంటేనే మీరు థియేటర్స్ కు వస్తారని తెలుసు. మేము ఎంత అడిగినా రారు. “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్, టీజర్ మీకు నచ్చితే తప్పకుండా ఈ నెల 27న థియేటర్స్ కు రండి. మీకు సినిమా నచ్చితే పది మందికి చెప్పండి.

ప్రభాస్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రభాస్ గారిని కలిశాను. ఆల్ ది బెస్ట్ చెప్పి, డ్రింకర్ సాయి సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా చెప్పారు. ఆయన అలా విష్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అన్నారు. డ్రింకర్ సాయి సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు.

డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూమీకు మా “డ్రింకర్ సాయి” సినిమా నచ్చకుంటే జీరో రేటింగ్ ఇవ్వండి. కాస్త మీ మనసును కదిలించినా 3 రేటింగ్ ఇవ్వండి. మా సినిమాకు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అని చెప్పారు. ఇక డిఓపి ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాకు ఎంతో నమ్మకంతో ఉన్నాం అని చెప్పారు. మరియు వీరందరి నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.