Ambanti: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సినీ సెలబ్రిటీ లందరూ కూడా నేడు ఆయనని భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సమస్యలను సినీ సెలబ్రిటీలు రేవంత్ ముందు ఉంచారు అదేవిధంగా రేవంత్ రెడ్డి సినిమాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా కోరారు.
ఈ క్రమంలోనే తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ రేవంత్ రెడ్డి కూడా వ్యవహరించారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచే ప్రసక్తే లేదని ఈయన క్లారిటీ ఇచ్చేశారు. ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగినదని పలువురు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల ఒక సామాన్య ప్రేక్షకుడి కూడా థియేటర్ కి వెళ్లి సినిమాని చూడగలరు లేదంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒక సామాన్య కుటుంబానికి ఉండదని ఈయన నిర్ణయం సరైనదని అందరూ భావిస్తున్నారు.
ఇకపోతే తాజాగా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఈ సెలబ్రిటీలు రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఈ విషయంపై పరోక్షంగా ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఈయన ట్వీట్ చేస్తూ పూర్తి పరిష్కారం కావాలి అంటే ”sofa” చేరాల్సిందే అంటూ ట్వీట్ చేశారు. పుష్ప 2 సినిమాలో పొలిటికల్ పరంగా ఏ సమస్యనైనా పరిష్కరించాలి అంటే సోఫా నిండా డబ్బులు పెట్టి మరి అల్లు అర్జున్ ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు అయితే ఆ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డికి కూడా ఒక సోఫా పంపిస్తేనే పూర్తి పరిష్కారం వస్తుందనే విధంగా ఈయన రేవంత్ రెడ్డి పట్ల సెటైర్లు వేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ పోస్టుపై ఇటు సినీ సెలబ్రిటీలు అలాగే రేవంత్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
పూర్తి పరిష్కారానికి
“Sofa” చేరాల్సిందే!— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024
