కేటిఆర్ ను కలిసిన యాంకర్ సుమ

ప్రముఖ యాంకర్ సుమ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలిశారు. టిఆర్ఎస్ భవన్ లో శుక్రవారం ఆమె కేటిఆర్ ను కలిశారు. ఓ మంచి పని కోసమే కేటిఆర్ ను కలిశానని యాంకర్ సుమ తెలిపారు. ఓ మంచి పని కోసం కేటిఆర్ మద్దతు కోరానని అన్నారు.సమయం వచ్చినప్పుడు ఆ మంచి పని ఏందో చెప్తానన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపానన్నారు. ఈ సందర్భంగా సుమ కేటిఆర్ కు ఓ మొక్క బహుకరించారు. ప్రభుత్వ పని తీరు బాగుందని ఆమె ప్రశంసించారు. సుమ కేటిఆర్ తో ఏం మాట్లారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.