తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా బండ శివానందప్రసాద్ నియమితులయ్యారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా శివానంద ప్రసాద్ పనిచేస్తున్నారు. అడ్వకేట్ జనరల్ గా శివానంద ప్రసాద్ ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రకాశ్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం, ప్రసాద్‌ను నూతన ఏజీగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. శివానంద ప్రసాద్ స్వస్థలం జనగామ జిల్లా. హైకోర్టు చరిత్రలో మొట్టమొదటి సారి వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని అడ్వకేటు జనరల్ గా నియమించిన సీఎం కేసీఆర్ కు శివానంద ప్రసాద్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.