ఈ సమస్యల వల్ల మీ ఫోన్ స్లో అయ్యిందా… అయితే ఇలా చేస్తే చాలు కొత్త ఫోన్ లా పని చేస్తుంది?

ప్రస్తుత కాలంలో ప్రజలు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వినియోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లు కొన్న కొంతకాలానికి వాటిలో కొన్ని సమస్యల వల్ల ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్లు అన్ని ఫోన్లలో ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగానే పనిచేస్తాయి. వేరు వేరు కంపెనీలు తయారుచేసి ఈ స్మార్ట్ ఫోన్లో వేరువేరు ఆండ్రాయిడ్ సిస్టం ఉపయోగించటం వల్ల కొన్ని కామన్ సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా మొబైల్ ఫోన్లలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్లో చార్జింగ్ :

స్మార్ట్ ఫోన్ తీసుకున్న కొంతకాలం తర్వాత మొబైల్ ఫోన్ చార్జింగ్ అవటానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇలా స్లో ఛార్జింగ్ కావడానికి ముఖ్య కారణం కేబుల్ సమస్య . అంతే కాకుండా నెమ్మదిగా ఛార్జింగ్ కావడానికి మరొక కారణం బ్యాక్‌గ్రౌండ్ యాప్స్. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఓపెన్ చేయటం వల్ల అవి ఎక్కువ పవర్ ను తీసుకుని ఛార్జింగ్ స్లో అయ్యేలా చేస్తాయి. దీన్ని పరిష్కరించడానికి, మీరు ఎప్పటికప్పుడు ఓపెన్ చేసిన యాన్స్ ను క్లియర్ చేసుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఛార్జింగ్ పోర్ట్ దెబ్బ తినటం వల్ల కూడా చార్జింగ్ స్లోగా అవుతుంది. అలాంటి సమయంలో సర్వీస్ సెంటర్ కి వెళ్లి దాన్ని రిపేర్ చేయించుకోవాలి.
మొబైల్డేటా, Wi-Fi పనిచేయకపోవడం :

సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించేవారు వైఫై మొబైల్ డేటా పనిచేయకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. Wi-Fi పని చేయకుంటే, Wi-Fi సెట్టింగ్‌లకు వెళ్లి Wi-Fiని ఆఫ్ చేసి, దాన్ని మళ్లీ ఆన్ చేయండి. వెంటనే Android నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయగలదు. అలా నెట్వర్క్ కనెక్ట్ అవ్వకపోతే మొబైల్ డేటా ఆఫ్ చేసి ఆన్ చేయాలి. అయినా సరే మొబైల్ డేటా కనెక్ట్ అవ్వకపోతే మొబైల్ ఏరోప్లేన్ మోడ్ లో ఉంచి తర్వాత నార్మల్ మోడ్ ఆన్ చేస్తే మొబైల్ డేటా కనెక్ట్ అవుతుంది.

Google Play Store పనిచేయకపోవడం :

కొన్ని సందర్భాలలో మొబైల్ ఫోన్లో కొత్త యాప్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయటంలో కూడా సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఫోన్ మెమరీ నుంచి ప్లే స్టోర్‌ ని క్లియర్ చేయాలి…లేదంటే యాప్‌ని ఫోర్సడ్ స్టాప్ చేయాలి. అయిన సమస్య పరిష్కారం కాకపోతే, ‘అన్‌ఇన్‌స్టాల్ అప్‌డేట్స్’ను సెలెక్ట్ చేయాలి. అయినా సమస్య సాల్వ్ కాకపోతే మీ ఫోన్ లోని స్టోరేజ్ ని పరిశీలించి స్టోరేజ్ ప్లేస్ తక్కువగా ఉంటే అనవసరమైన ఫైల్స్ క్లియర్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది.