ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చి తన వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాటింగ్, షేరింగ్, వీడియో కాల్, ఆడియో కాల్ వంటి మరెన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ తాజాగా కస్టమర్ల కోసం మరొక కొత్త ఫీచర్ ని అమలులోకి తీసుకురానుంది. వాట్సాప్ యూజర్ ప్రైవసీ, యాప్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
ఇప్పటికే WhatsApp iOS వెర్షన్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్, క్యాప్షన్‌లతో మీడియాను ఫార్వార్డ్ చేయడం, మెసేజ్ యువర్ సెల్ఫ్, iOS, Android, Web యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేసింది. ఇక తాజాగా వాట్స్అప్ ద్వారా పంపిరా మెసేజ్లను కూడా ఎడిట్ చేసే విధంగా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా యూజర్లు పంపిన ఏదైనా మెసేజ్‌ని టైమ్ ఫ్రేమ్ నుంచి 15 నిమిషాలలోపు ఎడిట్ చేసేందుకు అవకాశం ఉంది. వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లో ఏదైనా తప్పును సవరించడానికి మరింత సమాచారాన్ని చేర్చడానికి యూజర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్‌లో ఎవరైనా మొత్తం మెసేజ్ డిలీట్ చేయకూడదని అనుకుంటే.. దానికి బదులుగా కొన్ని పదాలను ఎడిట్ చేసేందుకు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
అయితే ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ లేటెస్ట్ WhatsApp వెర్షన్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. అలాగే మీడియా క్యాప్షన్లకు కాకుండా కేవలం వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, ఈ సరికొత్త ఫీచర్ iOS యూజర్ల కోసం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో బీటా టెస్టింగ్ కోసం కొత్త అప్‌డేట్ రిలీజ్ చేస్తుందని వాట్సప్ వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో యాప్ అప్‌డేట్‌లో యూజర్లు కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. అలాగే వాట్స్అప్ iOS యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను కూడా టెస్టింగ్ చేస్తోంది. iOS డివైజ్‌లలో ఇమేజ్ క్వాలిటీని మార్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.