ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్!

భారతదేశంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్నటువంటి ఇన్స్టాంట్ మెసెంజర్ ఆప్ వాట్సాప్ కు ఎక్కువమంది యూజర్లు ఉన్నారు.ఇలా యూజర్లకు అనుగుణంగా వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండవని చెప్పాలి.

సాధారణంగా మనం ఒక మెసేజ్ ఒకరికి పెట్టే బదులు మరొకరికి పెడుతుంటాము. అయితే వెంటనే మనం అలర్ట్ అయ్యి డిలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఆప్షన్స్ ద్వారా మనం పంపించినటువంటి మెసేజ్ తొందరగా డిలీట్ చేయవచ్చు. అలాకాకుండా తొందరపాటులో డిలీట్ ఫర్ మీ అని ప్రెస్ చేసినప్పుడు కేవలం ఆ మెసేజ్ మనకు మాత్రమే డిలీట్ అవుతుంది. అవతల వారికి ఆ మెసేజ్ అలాగే ఉంటుంది ఇలాంటి సమయంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌కి బదులుగా డిలీట్ ఫర్ మీ ఆప్షన్‌ ప్రెస్‌ చేసినప్పుడు.. ఆ యాక్షన్‌ను UNDO చేయడానికి వాట్సాప్‌ వీలు కల్పించనుంది. వాట్సాప్ ఇటీవలే యాక్సిడెంటల్ డిలీట్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ పర్సనల్, గ్రూప్‌ చాట్‌లలో కూడా పని చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ కొన్ని iPhone, Android డివైజ్‌లలో పరికరాల్లో అందుబాటులోకి వచ్చింది.