స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్ ఇచ్చిన వాట్సప్.. ఇక పై 36స్మార్ట్‌ ఫోన్లలో వాట్సాప్ సేవలకు బ్రేక్..?

ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సప్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్స్అప్ తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్ పాత స్మార్ట్ ఫోన్ విరియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6, ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ SEతోపాటు మరికొన్ని ఓల్డ్ వర్షన్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలకు బ్రేక్ పడింది .

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయాలంటే తప్పనిసరిగా ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 లేదా ఆ తర్వాత వెర్షన్‌తో మొబైల్ రన్ అవ్వాలి… లేదంటే వాట్సాప్ ఉపయోగించడానికి ఇకపై విలువ లేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి దాదాపు 36 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయటం లేదు. Apple iPhone 6, మొదటి తరం iPhone SE లేదా పాత Android ఫోన్‌ని ఉపయోగిస్తున్న వారు ఇకపై వాట్సాప్ ఉపయోగించలేరు. నివేదికల ప్రకారం.. Meta యాజమాన్యంలోని WhatsApp కొన్ని పాత స్మార్ట్‌ఫోన్‌లలో ఫిబ్రవరి 1, 2023 నుండి పనిచేయడం మానేస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌ని రన్ చేయడానికి, దీన్ని ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్‌లో రన్ చేయవచ్చు. అయితే iOS వెర్షన్ 12, అంతకంటే ఎక్కువ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది . ఇకపై పాత OS వెర్షన్‌లలో నడుస్తున్న స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ సపోర్ట్ చేయదు. అయితే వాట్సాప్ వినియోగానికి బాగా అలవాటు పడిన ప్రజలు ఇలా వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయని తెలియడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ఇప్పటికే ప్రజలకు ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వాట్సాప్ మెసేజెస్ మాత్రమే కాకుండా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అందిస్తోంది. ఇక ఇటీవల వాట్సప్ పేమెంట్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి వాట్సాప్ అందించే ఈ సేవలు అన్ని నిలిచిపోయాయి.