Ys Jagan Losing His Words : వెంట్రుక కూడా పీకలేరు: సంయమనం కోల్పోతున్న సీఎం వైఎస్ జగన్

Ys Jagan Losing His Words

Ys Jagan Losing His Words : ‘నన్నెవరూ ఏమీ చేయలేరు..’ అనడమే అహంకారానికి నిదర్శనం. అలాంటిది, ‘నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటే, దాన్ని ఏమనాలి.? రాజకీయాల్లో హుందాతనం అవసరం. అది లేకపోవడం వల్లే నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, టీడీపీ అత్యంత పతనావస్థకు చేరుకోవడానికి కారణమయ్యింది. బహుశా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబులానే అవ్వాలనుకుంటున్నారా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట తూలడం చూశాం.. చంద్రబాబు మాట తూలడం చూస్తున్నాం. నారా లోకేష్ అత్యుత్సాహం సంగతి సరే సరి. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంయమనం కోల్పోకుండా వుండేందుకు వీలైనంతగా ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు సంయమనం కోల్పోతున్నారు.

సంయమనంతో రాజకీయాలు చేసేవారికే రాజకీయాల్లో ఉన్నత స్థానం లభిస్తుంది. ఆ కీలకమైన విషయాన్ని ఎందుకు ఆయన విస్మరిస్తున్నట్లు.? విపక్షాలు ఒక్కతాటిపైకి వస్తే, వైఎస్ జగన్ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు.? స్థానిక ఎన్నికల్లో విపక్షాలు గల్లంతయ్యాయి. అలాంటప్పుడు, వైఎస్ జగన్ ఎందుకు విపక్షాలకు భయపడాలి.?

ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోంది. వేలాది మంది జనం హాజరైన ఓ అధికారిక కార్యక్రమంలో విపక్షాలపై విరుచుకుపడుతూ, ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది. పొరపాటున వైఎస్ జగన్ నోరు జారారా.? అంటే, ఆయన ఇటీవల బ్యాక్ టు బ్యాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారాయె.