జగన్ లో భయాన్ని వైసీపీ నేతలు కోరుకుంటున్నారా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది వైసీపీ నేతలు భావిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గరకు వెళుతున్న వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అభివృద్ధి ఎందుకు చేయడం లేదని జనం వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు.

రోడ్లు సరిగ్గా లేవని, తమ పిల్లలకు ఉద్యోగాలు రాలేదని, అన్ని అర్హతలు ఉన్నా తమకు పథకాలు అందడం లేదని కొంతమంది ప్రజలు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాళ్లు ఆ సమాధానాలతో సంతృప్తి పడటం లేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేశామని జగన్ చెబుతున్నా ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది.

మరోవైపు జగన్ సర్కార్ చేస్తున్న లక్షల కోట్ల అప్పులపై కూడా సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలలో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. అప్పులు చేసి పథకాలను అమలు చేయడం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేయాలన్నా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. జగన్ 2024 ఎన్నికల ఫలితాల విషయంలో భయపడితే మాత్రమే ఈ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎవరైతే భయపడతారో వాళ్లు జాగ్రత్తగా మసులుకుంటారని జగన్ నుంచి కూడా మేము అదే కోరుకుంటున్నామని వైసీపీ నేతల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జగన్ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఫలితాలే 2024లో వైసీపీ సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.