Some Ministers Jump Into BJP : ఆ మంత్రులపై ఓ కన్నేసి వుంచిన సీఎం వైఎస్ జగన్.!

Some Ministers Jump Into BJP

Some Ministers Jump Into BJP :  అసలు వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు ఎందుకు జంప్ చేస్తారు.? పైగా, కొందరు మంత్రులు బీజేపీతో టచ్‌లో వున్నారట. అయితే, ఆ కళంకిత మంత్రుల్ని తాము చేర్చుకోబోమని బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు. ఎవరా మంత్రులు.? ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన క్యాబినెట్‌ని పునర్ వ్యవస్థీకరించనున్నారు. దాదాపు మంత్రులంతా పదవులు కోల్పోబోతున్నారు. కొత్తవారిని మంత్రి వర్గంలోకి వైఎస్ జగన్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఒకరిద్దరు పాత మంత్రులు కొనసాగే అవకాశమూ లేకపోలేదని చెబుతున్నారు.

‘ఒకరిద్దర్ని కొనసాగించడమేంటి.? తీసేస్తే అందర్నీ తీసెయ్యాలి.. ఒకరిద్దర్ని కొనసాగించదలచుకుంటే, మాకేం తక్కువ.? మమ్మల్ని కూడా కొనసాగించాల్సిందే..’ అంటూ ఓ పది మంది వరకు మంత్రులు ఆఫ్ ది రికార్డుగా తమ సన్నిహితుల వద్ద తెగ గుస్సా అవుతున్నారట.

రాజకీయాల్లో సీనియర్లు అయిన ఆ పది మంది విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారట ఇప్పటికే. అందులో ఒకరిద్దరు పక్కదారి చూస్తున్నారట కూడా. వాళ్ళు బీజేపీతో టచ్‌లోకి వెళ్ళినట్లు అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద సమాచారం వుందని తెలుస్తోంది. (Some Ministers Jump Into BJP)

కానీ, బీజేపీలోకి వెళ్ళి సదరు మంత్రులు సాధించేది ఏంటి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది గనుక, సోకాల్డ్ మంత్రులకు బీజేపీ కొంత కాలం షెల్టర్ జోన్ అయ్యే అవకాశాల్లేకపోలేదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ, వైసీపీకి గట్టిగా ఎదురు తిరగడంలేదు. సో, ఇదేమన్నా అవగాహనతో నడుస్తున్న వ్యవహారమా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.