లెజెండ్ పక్కన నటించడానికి ఊర్వశి అంత తీసుకుందా.. వామ్మో!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి అందరికీ పరిచయమే. పలు సినిమాలలో నటించిన ఈమె స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది. కానీ కొంత వరకు తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. మోడలింగ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ బాలీవుడ్ లో ఎదగడానికి బాగా ప్రయత్నిస్తుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లను బాగా పిచ్చెక్కిస్తుంది. నిజానికి ఈమె ధరించే దుస్తులు చూస్తే మతి పోక తప్పదు. పైగా కొన్ని కొన్ని సార్లు బాగా నెగటివ్ కామెంట్స్ కూడా ఎదురుకుంటుంది. కానీ అవేవి పట్టించుకోకుండా తానే ఏంటో తాను చూసుకుంటుంది. ఇక ఈ బ్యూటీ నటిగా కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయం లో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇప్పటికే తను స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ విషయంలో చాలాసార్లు వార్తల్లోకెక్కింది.

గతంలో ఊర్వశి రౌతేలా స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ ను ప్రేమించింది. ఈ విషయం బాలీవుడ్ లో కోడై కూసింది. అంతేకాకుండా ఈ జంట చాలా సార్లు మీడియా కంటికి చిక్కింది. వీళ్లు గతంలో డిన్నర్ డేట్ లలో బాగా తిరిగారు. కొంత కాలం డేటింగ్ లో ఉండి బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరి మధ్య బ్రేక్ అప్ జరిగింది.

ప్రస్తుతం ఊర్వశి సింగిల్ గా ఉండగా.. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంది. అందులో బ్లాక్ రోజ్ అనే తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యే సినిమాలలో నటిస్తుంది. తొలిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది ఊర్వశి. ఇక ఇటీవలే ఈ బ్యూటీ జీడి జెర్రీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది లెజెండ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు హీరోగా అవతారం ఎత్తాడు ప్రముఖ వ్యాపారవేత శరవణన్. ఎటువంటి టాలెంట్ లేకున్నా కూడా హీరోగా అడుగుపెట్టాడు శరవణన్ చూడటానికి చాలా పెద్ద వయసు వ్యక్తిలా ఉంటాడు. ఈయన పెద్ద బిజినెస్ పర్సన్. ఇక ఈ సినిమా కోసం ఆయన బాగా ఖర్చు చేసినట్లు తెలిసింది.

పైగా హీరోయిన్ గా నటించిన ఊర్వశి రౌతెలా కి ఈ సినిమాకు ఇచ్చిన రిమ్యునరేషన్ బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే దాదాపు రూ.20 కోట్లు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తీసుకోనంత రెమ్యూనరేషన్ ఊర్వశి తీసుకోవటంతో అందరూ షాక్ అవుతున్నారు. కానీ ఆ సినిమా మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేక పోయింది. సినిమాకి నష్టం వచ్చినా కూడా హీరోయిన్ కి మాత్రం ఎటువంటి నష్టం రాలేదు అని తెలుస్తుంది.