Pushpa Movie: పుష్ప సినిమా హిందీలో సక్సెస్ అవ్వడం వెనుక అతని ప్రమేయం ఉందా!

Pushpa Movie: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్ లలో పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ని అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలో కూడా అదేవిధంగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇకపోతే మొదట్లో పుష్ప సినిమా హిందీ లో రిలీజ్ అవుతుంది అని ప్రచారం జరిగిన సమయంలో చాలామంది ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ సౌత్ హీరోల సినిమాలకు బాలీవుడ్ లో కలెక్షన్ల రావు అంటూ కామెంట్స్ చేశారు.

ఇక పుష్ప సినిమా హిందీలో దాదాపుగా 1600 స్క్రీన్లలో విడుదలైన విషయం తెలిసిందే. హిందీలో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. ఇక అందరి అంచనాలను చిత్తు చిత్తు చేస్తూ పుష్ప సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి, హిందీలో రికార్డులను క్రియేట్ చేసింది ఇకపోతే హిందీలో ఈ సినిమా ఆ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి గల కారణం అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి. పుష్ప సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పిన వ్యక్తి పేరు శ్రేయాస్. అతని పూర్తి పేరు శ్రేయాస్ తాల్పడే.

ఇక అతడి పుష్ప సినిమా డబ్బింగ్ హిందీ వెర్షన్ లో అద్భుతంగా చెప్పాడు. అంతేకాకుండా పుష్ప సినిమాకు ఈ స్థాయిలో గుర్తింపు తగ్గడానికి అతడు చాలా కష్టపడ్డాడు. ఇక శ్రేయాస్ కెరీర్ మొదట్లో కొంతమంది వాయిస్ ఆర్టిస్ట్ గా పనికిరావని విమర్శలు కూడా చేశారట. ఇక పుష్ప సినిమా అంతగా సక్సెస్ అయిన సందర్భంగా శ్రేయాస్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా హిందీ వెర్షన్ లో అంతగా సక్సెస్ కావడానికి తన పాత్ర ఏమీ లేదు అంటూ వెల్లడించడం గమనార్హం.